ఆకలిని తరిమికొట్టి.. న్యాయం వైపు విజయం సాధించడమే ఎస్డీపీఐ లక్ష్యం
ప్రజాస్వామ్యంలో భయం లేకుండా ప్రజలంతా సమానంగా ముందుకు సాగాలి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ షా సూర్యాపేట జిల్లా కేంద్రం: ఆకలిని తరిమికొట్టి, న్యాయం వైపు విజయం సాధించడమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) ప్రధాన లక్ష్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, ప్రజల్లో పార్టీని మరింత విస్తరించాల్సిన అవసరంపై మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం ఉండాలని ఆయన అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ హక్కుల కోసం ముందుకు సాగాలని పేర్కొన్నారు. సమాజంలో...