Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

Author
Posted By A.Timma Gurudu
| 13 Oct 2026, 06:36 PM | Array
వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు.
జోగులాంబ గద్వాల13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. వెట్టిచాకిరీ నిర్మూలనపై జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కళాకారులు తమ ప్రదర్శనలతో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ ఆవరణంలో వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి 'స్వేచ్ఛా రథం' ప్రచార కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్లు ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టి చాకిరీ బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు తమ హక్కులు, అందుబాటులో ఉన్న సహాయ మార్గాలపై అవగాహన కల్పించడంతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 08069434343 ను ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా నిరోధించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, బాధితులను గుర్తించడం, వారిని రక్షించడం, అవసరమైన సహాయం మరియు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు లేదా శ్రమ దోపిడీ ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితులను గుర్తించి, విముక్తి కల్పించి, పునరావాసం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. హెల్ప్ లైన్ ఫోన్ నంబరు కు సమాచారం అందించడం ద్వారా వెట్టి చాకిరీ ఘటనలను అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి వేణుగోపాల్, డిడబ్ల్యుఓ సునంద, డిఇఓ విజయలక్ష్మి, కళాకారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.