వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు. జోగులాంబ గద్వాల13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. వెట్టిచాకిరీ నిర్మూలనపై జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కళాకారులు తమ ప్రదర్శనలతో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ ఆవరణంలో వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి 'స్వేచ్ఛా రథం' ప్రచార కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్లు ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టి చాకిరీ బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు తమ హక్కులు, అందుబాటులో ఉన్న సహాయ మార్గాలపై అవగాహన కల్పించడంతో పాటు టోల్ ఫ్రీ...