Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 04:37 AM |
కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

సూర్యాపేట మార్కెట్‌లో దాడువాయిలు, హమాలీలు, స్వీపర్లు, ఆడకూలీలకు యూనిఫాంల పంపిణీ.....
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.

సూర్యాపేట:- వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్న దాడువాయిలు, హమాలీలు, స్వీపర్లు, ఆడకూలీలకు ఏకరూప దుస్తులు (యూనిఫాంలు) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులకు, వ్యాపారులకు సేవలందించడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న కార్మికుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. మార్కెట్ యార్డులో పనిచేసే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. కార్మికులకు అవసరమైన సహకారం అందిస్తూ, వారి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కార్మికులకు యూనిఫాంల పంపిణీ చేయడం ద్వారా విధుల్లో ఏకరూపత, గుర్తింపు పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ పరిధిలో రైతులు, వ్యాపారులు, కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కార్యదర్శి ఎండి ఫసియోద్దిన్, సిబ్బంది,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎం.డి. షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అడ్తి అసోసియేషన్, అపరాల అసోసియేషన్, ట్రేడర్స్ అసోసియేషన్, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, హమాలి కార్మికులు, స్వీపర్లు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.