కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం
సూర్యాపేట మార్కెట్లో దాడువాయిలు, హమాలీలు, స్వీపర్లు, ఆడకూలీలకు యూనిఫాంల పంపిణీ..... మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సూర్యాపేట:- వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్న దాడువాయిలు, హమాలీలు, స్వీపర్లు, ఆడకూలీలకు ఏకరూప దుస్తులు (యూనిఫాంలు) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు, వ్యాపారులకు సేవలందించడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎండ,...