Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అంధకారంలో 5వ వార్డు .. పట్టించుకోని అధికారులు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 12 Oct 2026, 09:41 PM |
అంధకారంలో 5వ వార్డు .. పట్టించుకోని అధికారులు

తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ : తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని మాలిపురం 5వ వార్డు ఆవరణలో గల విద్యుత్ స్తంభాలు రాత్రి వేళలో విద్యుత్ కాంతులు విరజిమ్మక. ఆ కాలనీ ప్రాంతంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా మున్సిపల్ సిబ్బంది పొరపాటా.. ఏది ఏమో గాని కాలనీ వాసుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం. తక్షణమే విద్యుత్ స్తంభాలకు విద్యుత్ కాంతులు ప్రకాశింప చేయాలని అలాగే రాత్రివేళ వీధి దీపాలు పక్కాగా పనిచేయడంతో పాటు పగటి పూట వెలగకుండా చర్యలు తీసుకుని విద్యుత్ వృధాను అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.