Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఘనంగా ఏపూరి సోమన్న జన్మదిన వేడుకలు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 12 Oct 2026, 09:14 PM | తెలంగాణ Telangana
ఘనంగా ఏపూరి సోమన్న జన్మదిన వేడుకలు

తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్నను వివిధ వర్గాలు, వివిధ కుల సంఘాల నాయకులు,సామాజిక వాదులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమన్న ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం ఎన్నో పాటలు రాశానని తుంగతుర్తి నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి సహకారంతో తుంగతుర్తిని అభివృద్ధి చేయిస్తానన్నారు. నేను పుట్టి పెరిగిన వెలిశాల తిరుమలగిరికి ఏపూరి అంటే ఏందో తెలవాలని ఆయన అన్నారు. ఏపూరి సోమన్న మాట ద్వారా తెలుగు రెండు రాష్ట్రాలకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిగా అవకాశం వచ్చినప్పుడు మీరందరూ నన్ను దీవించాలని వేడుకున్నారు. ఇది రాజగోపాల్ రెడ్డి సహకారంతోనే సాధ్యమైతుందని ఆయన అన్నారు రాజగోపాల్ రెడ్డి తోనే తుంగతుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఏపూరి ఫౌండేషన్ చైర్మన్ తీగల కరుణశ్రీ, ఫౌండేషన్ గౌరవ సలదారి ప్రభాక,ర్ ఏపూరి ఫౌండేషన్ రాష్ట్ర యూత్ వింగ్ కార్యనిర్మాణ అధ్యక్షులు ఏపూరి చందు,శేఖర్,లింగం, శివ, రమేష్, పరమేష్, రవి జానీ,అనుదీప్, లావణ్య, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.