ఘనంగా ఏపూరి సోమన్న జన్మదిన వేడుకలు
తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్నను వివిధ వర్గాలు, వివిధ కుల సంఘాల నాయకులు,సామాజిక వాదులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమన్న ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం ఎన్నో పాటలు రాశానని తుంగతుర్తి నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి సహకారంతో తుంగతుర్తిని అభివృద్ధి చేయిస్తానన్నారు. నేను పుట్టి పెరిగిన వెలిశాల తిరుమలగిరికి ఏపూరి అంటే ఏందో తెలవాలని ఆయన అన్నారు. ఏపూరి సోమన్న మాట ద్వారా తెలుగు రెండు రాష్ట్రాలకు...