Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Author
Posted By A.Timma Gurudu
| 12 Oct 2026, 08:20 PM | Array
ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన అదనపు ఎస్పీ కే. శంకర్.
జోగుళాంబ గద్వాల 12 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల్. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. శంకర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు వివరించరు. ఈ సోమవారం మొత్తం 10 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, న్యాయమైన పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించబడుతుంది.

సోమవారం అందిన ఫిర్యాదుల వివరాలు:

- వేధింపులకు సంబంధించి – 01
- గొడవలకు సంబంధించి – 02
- భూ వివాదాలకు సంబంధించి – 06
- మోసానికి సంబంధించి – 01

మొత్తం ఫిర్యాదులు – 10

ఇవి కూడా చదవండి

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పురోగతిని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.