ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన అదనపు ఎస్పీ కే. శంకర్. జోగుళాంబ గద్వాల 12 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల్. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. శంకర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు వివరించరు. ఈ సోమవారం మొత్తం 10 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, న్యాయమైన పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల...