Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మాన్ దొడ్డి ఉప సర్పంచ్ చెక్ పవర్ జిల్లా కలెక్టర్ రద్దు ఆదేశాలను ను డిస్మిస్ చేసిన హైకోర్టు

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:19 PM | తాజా సమాచారం
మాన్ దొడ్డి ఉప సర్పంచ్ చెక్ పవర్ జిల్లా కలెక్టర్ రద్దు ఆదేశాలను ను డిస్మిస్ చేసిన హైకోర్టు

ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
--బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యస్ .రామచంద్రారెడ్డి.

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. రాజోలి.మండలం మాన్ దొడ్డి ఉపసర్పంచ్, భీమన్న చెక్ పవర్ ను కలెక్టర్ ఎలాంటి విచారణ చేయకుండా ఇటీవల రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా దీని విషయం కలెక్టర్ కి వెళ్లి అడిగితే మీరు వెళ్లి కోర్టు తెచ్చుకోండి నేనేం చేయలేము అన్నారు.వాస్తవానికి అక్కడ వీరు చెప్పిందానికి చాలా విరుద్ధంగా ఉంది. ఉప సర్పంచ్ పూర్తిగా సహకరిస్తున్నారు అదేవిధంగా గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి గురించి అడగడమే వారికి ఇబ్బంది ఉన్నట్టుంది కాబట్టి అధికారులు ఏమాత్రం విచారణ చేయకుండా కలెక్టర్ మాన్ దొడ్డి ఉపసర్పంచ్ భీమన్న చెక్ పవర్ రద్దు చేయడం పై హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కలెక్టర్ రద్దు చేయడం కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపట్టు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఎలాంటి విచారణ చేయకుండా ఎలాంటి చర్చ పెట్టకుండా జి ఓ అడ్డదారిని తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపసర్పంచ్ లందరినీ భయభ్రాంతులను గురిచేయడానికి ఒక జీవో తెచ్చి వారి మాట ఎవరైతే వినరో వారి పార్టీలోకి ఎవరు రారో వారందరినీ ఈ రకంగా చెక్ పవర్ రద్దు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపసర్పంచ్ లందరికీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఒక సర్పంచ్ వల్లనే కాదు సర్పంచ్, ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు ,అదేవిధంగా అధికారులు గ్రామ ప్రజలందరూ కలిసి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా గనుక ఉపసర్పంచ్ చెక్ పవర్ ఉండకుంటే ఏకపక్ష నిర్ణయం ఉంటుంది అదేవిధంగా అధికారులు దాదాపు అధికార పార్టీ మాటనే వింటారు. కాబట్టి కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండటి ప్రతి ఒక్కరికి ఉపసర్పంచ్ లందరికీ చెక్పవర్ కచ్చితంగా గతంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఉండాలి. ఏమాత్రం వాళ్ళ పార్టీ లోకి రాకుంటే రద్దు చేయడం ఈ రకంగా ఇది ఒక బ్లాక్మెయిల్ రకంగా చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ యొక్క జి ఓ ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం లో మాన్ దొడ్డి ఉప సర్పంచ్ భీమన్న,బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు సంఘాల సంజీవ రెడ్డి, వార్డ్ సభ్యులు రమేష్ బాబు రాజోలి మండల యస్ సి మోర్చా అధ్యక్షులు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు…

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.