Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చిన్న గల్లీలో పార్కింగ్ లొల్లి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 12 Oct 2026, 09:42 AM | తెలంగాణ Telangana
చిన్న గల్లీలో పార్కింగ్ లొల్లి

తిరుమలగిరి 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
నగరాలు, పట్టణాలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో... వాణిజ్య ప్రాంతాలలో పార్కింగ్ కొరత అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న నివాస ప్రాంతాలు సైతం ఇప్పుడు కమర్షియల్ హబ్‌లుగా మారిపోతున్నాయి. దీనివల్ల వ్యాపారాలు విస్తరిస్తున్న మాట వాస్తవమే అయినా, అక్కడ నివసించే స్థానికులు, నిత్యం ప్రయాణించే సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇరుకు సందుల్లో అడ్డగోలుగా వాహనాలు పార్క్ చేయడం, నిరంతరం ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది.ఒకప్పుడు కేవలం ఇళ్ళు మాత్రమే ఉండి, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు నడవడానికి అనువుగా ఉన్న వీధులు ఇప్పుడు షాపింగ్ మాల్స్, కోచింగ్ సెంటర్లు, హాస్పిటల్స్, హోటళ్ళు, మరియు గోడౌన్లకు నిలయాలుగా మారిపోయాయి. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా నివాస ప్రాంతాలలో కమర్షియల్ పర్మిషన్లు ఇవ్వడం ఈ సమస్యకు మూలకారణం.షాపుల యజమానులు, ఉద్యోగుల వాహనాలతో ఉదయమే వీధులన్నీ నిండిపోతాయి.ఇప్పటికే ఇరుగ్గా ఉన్న రోడ్డుకు ఇరువైపులా బైకులు, కార్లు పార్క్ చేయడంతో దారి మరింత సన్నగా మారుతుంది. వాహనదారులు నిర్లక్ష్యంగా బండ్లు ఆపేసి వెళ్ళిపోతున్నారు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి.అంబులెన్స్,అత్యవసర పరిస్థితి వస్తే ఒక అంబులెన్స్ గానీ,అగ్నిమాపక శకటం గానీ ఈ సందుల్లోకి వచ్చే పరిస్థితి లేదు.రోడ్లపై వాహనాలు నిండిపోవడంతో నడవడానికి కూడా స్థలం లేక వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కేవలం ట్రాఫిక్ పోలీసుల చలానాలే సరిపోవు.వ్యవస్థాగత మార్పులు రావాలి.కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అనుమతి ఇచ్చేటప్పుడే సదరు బిల్డింగ్‌కు తగినంత పార్కింగ్ సదుపాయం ఉందో లేదో మున్సిపల్ అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి.
ఇరుకు సందుల్లో అడ్డగోలుగా పార్క్ చేసే వాహనాలను వెంటనే టావింగ్ చేయడం,భారీగా జరిమానాలు విధించడం చేయాలి.అధికారులు,వ్యాపారులు, వాహనదారులు సంయుక్తంగా బాధ్యతగా వ్యవహరించనంత కాలం... ఈ 'ఇరుకు సందుల నరకం' నుండి సామాన్యుడికి విముక్తి లభించదు మరి మున్సిపల్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.