Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దళారులను నమ్మి మోసపోవద్దు మార్కెట్ యార్డ్ చైర్మన్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 09 Oct 2026, 09:32 PM | తెలంగాణ Telangana
దళారులను నమ్మి మోసపోవద్దు మార్కెట్ యార్డ్ చైర్మన్

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మార్కెట్లో ధాన్యానికి రికార్డు ధరలు: మద్దతు ధరను మించి అదనంగా రూ.1,000 వరకు పలికిన రేటు ఐదు జిల్లాల సరిహద్దు మార్కెట్‌కు పోటెత్తిన రైతాంగం ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, కందులకు రూ.9,870 తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు రైతులు తెచ్చిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, ఐకేపీ కేంద్రాల బోనస్ కంటే భారీగా అదనపు ధర పలికినట్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ తెలిపారు. శుక్రవారం మార్కెట్ యార్డులో పంట అమ్మకాలను ఆమె స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ మాట్లాడుతూ.. తిరుమలగిరి మార్కెట్ యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట వంటి ఐదు జిల్లాల సరిహద్దుల్లో ఉండటంతో వివిధ ప్రాంతాల నుండి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికే ధాన్యాన్ని తరలిస్తున్నారని చెప్పారు. గత సంవత్సరం సన్నాలకు బోనస్‌తో కలిపి రూ.2,883 ధర ఉండగా, ఈసారి మార్కెట్లో అంతకంటే చాలా ఎక్కువ రేటు లభిస్తోందన్నారు మార్కెట్లో సన్న రకానికి మద్దతు ధర కంటే రూ.600 నుండి రూ.1,000 వరకు అదనంగా లభిస్తోంది. శుక్రవారం నాడు సన్నాలకు గరిష్ఠంగా రూ.3,710, కనిష్ఠంగా రూ.3,300 ధర పలికింది దొడ్డు ధాన్యం: దొడ్డు రకానికి గరిష్ఠంగా రూ.2,961 కాగా, కనిష్ఠంగా రూ.2,401 ధర వచ్చింది. కందులు: కందులకు కూడా ఊహించని రీతిలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.9,870 ధర పలికింది దళారులను నమ్మొద్దు
మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని చైర్ పర్సన్ తెలిపారు. అందుకే రైతులు ఇక్కడికి రావడానికే మొగ్గు చూపుతున్నారని, శుక్రవారం ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం దిగుమతి అయిందని వివరించారు. రైతులు ఎవరూ దళారుల బారిన పడి నష్టపోవద్దని, నేరుగా మార్కెట్ యార్డుకే వచ్చి తమ పంటను అమ్ముకొని లాభాలు పొందాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వై. నరేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు రాపాక సోమేష్, దొడ్డ రమేష్, మార్కెట్ కార్యదర్శి షంషీర్, మార్కెట్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.