దళారులను నమ్మి మోసపోవద్దు మార్కెట్ యార్డ్ చైర్మన్

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మార్కెట్లో ధాన్యానికి రికార్డు ధరలు: మద్దతు ధరను మించి అదనంగా రూ.1,000 వరకు పలికిన రేటు ఐదు జిల్లాల సరిహద్దు మార్కెట్‌కు పోటెత్తిన రైతాంగం ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, కందులకు రూ.9,870 తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు రైతులు తెచ్చిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, ఐకేపీ కేంద్రాల బోనస్ కంటే భారీగా అదనపు ధర పలికినట్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ తెలిపారు. శుక్రవారం మార్కెట్ యార్డులో పంట అమ్మకాలను ఆమె స్వయంగా పరిశీలించి, రైతులతో...