Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కౌలు రైతులను ఆదుకోవాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 09 Oct 2026, 09:25 PM | తెలంగాణ Telangana
కౌలు రైతులను ఆదుకోవాలి

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ ప్రాంతంలో వర్షాలు సరిగ్గా లేక వేసిన పంటలన్నీ ఎండిపోయి. అక్కర రాణి రెక్కల కష్టంగా కౌలు రైతు పరిస్థితి ఉన్నది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతు సమస్యలను పరిష్కరించాలని జి.ఎం.పి.ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు
ఒక ఎకరాకు భూమికవులు 20, వేలనుండి 25 వేలవరకు భూమికి కౌలు ఇస్తున్నారు కౌలు రైతు వేసిన పంటలు చేతికి రాక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దిక్కు తోచని స్థితిలో కౌలు రైతు ఉన్నాడు ప్రభుత్వము కవులు రైతు ప్రతి పంటకు పంటల బీమా పథకాన్ని చేర్పించాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు కౌలు రైతులకు వర్తించే విధంగా హైడెన్ట్ కార్డు ఇవ్వాలి కార్డులు లేకపోవడం వల్ల బ్యాంకులలో లోన్ ఇవ్వడం లేదు ఓటిపి పద్ధతిలో ధాన్యము అమ్ముకునే కాడ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం బ్యాంకులలో అప్పు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి వ్యవసాయం చేయవలసిన పరిస్థితి కౌలు రైతుకున్నదిప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కానీ ఎక్కువ భూములు కలిగి వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇచ్చే వారికి లబ్ధి పొందుతున్నారు తప్ప రెక్కలతో కష్టం చేసి పెట్టుబడి పెట్టి పంటలు పండించే కౌలు రైతుకు ఏమి మిగలడం లేదు రైతు భరోసా మద్దతు ధర బోనసు ఇవి ఏవి కూడా కౌలు రైతుకు దక్కడం లేదు అత్యధిక వ్యవసాయం చేస్తున్న కవులు రైతుల సమస్యలను ప్రభుత్వ అధికారులు పరిశీలన చేసి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.