Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 07:51 PM | తాజా సమాచారం
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి

జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
వార్షిక తనిఖీలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన యూఐ కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. క్రైమ్ ప్రాపర్టీ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, స్వాధీనం చేసుకున్న ఆస్తుల భద్రత, గుర్తింపు, కోర్టు సంబంధిత ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు జీనత్ కుమార్,మనీషా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.