పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి

జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన యూఐ కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా...