Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 07:50 PM | తాజా సమాచారం
సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి : జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి
సమాచార హక్కు చట్టం–2005 వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 12, 2026 వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి జిల్లా అధికారులతో సమాచార హక్కు చట్టంపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అధికారులు సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందిస్తామని, స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం కీలకమని, పౌరులు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు . అనంతరం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం (RTI) వారోత్సవాల కార్యక్రమాన్ని అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.