సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి : జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి సమాచార హక్కు చట్టం–2005 వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 12, 2026 వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి జిల్లా అధికారులతో సమాచార హక్కు చట్టంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అధికారులు సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందిస్తామని, స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను...