Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దివ్యాంగుల భవిత సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 08 Oct 2026, 07:40 PM | తాజా వార్తలు
దివ్యాంగుల భవిత సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఫ్రీ ప్రైమరీ స్కూలు ను సందర్శించిన.
ప్రధానోపాధ్యాయులు కాంతయ్య.
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ఇటిక్యాల . మండలం చాగాపురం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని దివ్యాంగుల భవిత సెంటర్ నందు ఉపాధ్యాయులు రమేష్,సౌమ్య వారి విద్యా బోధనలో దివ్యాంగులకు వారిని ఇంప్రూవ్ చేసేందుకు గాను తరగతులను నిర్వహించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు కాంతయ్య తెలియజేశారు. ఇందులో ఇప్పటికే బాలికలు బాలురు కలిసి 15 మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుందని కాంతయ్య తెలియజేశారు. కావున చెవిటి మూగ మానసిక వికలాంగుల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను భవిత సెంటర్ నందు చేర్పించి వారిని విద్యాభ్యాసంలో ముందు వరుసలో నిలపాలని ప్రధానోపాధ్యాయులు కాంతయ్య విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాథమిక పాటశాలలో ప్రీ ప్రైమరీ స్కూల్ డిజిటల్ క్లాసులను వీక్షించిన ప్రధాన ఉపాధ్యాయులు కాంతయ్య గ్రామస్తులు,అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ లో బోధన విద్యాభ్యాసం(డిజిటల్ తరగతులు) నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని సకాలంలో విద్యార్థులను బడికి పంపి ఆన్లైన్ క్లాసులు వినే విధంగా అవగాహన కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కాంతయ్య విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగుల భవిత సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.