Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మహిళల భద్రతకు పటిష్ట వ్యవస్థ.. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పై అవగాహన కలిగి ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

Author
Posted By Telangana Vaartha
| 07 Oct 2026, 07:36 PM | తాజా వార్తలు
మహిళల భద్రతకు పటిష్ట వ్యవస్థ.. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పై అవగాహన కలిగి ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నాడు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ) మరియు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ (పిఓఎస్హెచ్) చట్టంపై మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ కీలక బాధ్యతలు చేపడుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ) ద్వారా నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పిఓఎస్హెచ్ చట్టం– 2013 నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళా ఉద్యోగుల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వాటిని తన దృష్టికి కూడా తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖలో ప్రతి మహిళా ఉద్యోగి ఆత్మవిశ్వాసంతో, భద్రతతో విధులు నిర్వహించేలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళ పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. ఆధునిక పోలీసింగ్‌లో కీలకంగా ఉపయోగిస్తున్న నాట్ గ్రిడ్, గాండీవ, సహాయోగ్ తదితర వెబ్ అప్లికేషన్లపై అవగాహన పెంపొందించుకుని, వాటిని విధి నిర్వహణలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అధికారులు సీఐ శ్రీలక్ష్మి, సిఐ రాము, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, డిస్టిక్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జ్ ఎస్సై శ్రీనివాస్, షీటీమ్ ఎస్సై రమాదేవి, జిల్లాలోని మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.