మహిళల భద్రతకు పటిష్ట వ్యవస్థ.. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పై అవగాహన కలిగి ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నాడు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ) మరియు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ (పిఓఎస్హెచ్) చట్టంపై మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ కీలక బాధ్యతలు చేపడుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ) ద్వారా నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పిఓఎస్హెచ్ చట్టం– 2013 నిబంధనలపై ప్రతి...