Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:50 PM | తాజా వార్తలు
పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

వాస్తవాలు తెలుసుకొని ఓటును సద్వినియోగం చేయాలి
మూడేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను ఒక్క ఓటుతో ఎండగట్టాలి

పట్టభద్రులకు ఓటు నమోదు పై అవగాహన కల్పించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశం మేరకు
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ జెడ్పిటిసి జీడి భిక్షం మరియు మండల అధ్యక్షులు శ్రీ వంగల శ్రీనివాస రెడ్డి గారు మరియు పార్టీ జిల్లా నాయకులు శ్రీ ఈ దుల యాదగిరి గ్రామ సర్పంచ్ శ్రీ బీరవోలు వెంకట కృష్ణ రెడ్డి గారు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో పట్టభద్రులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించి మాట్లాడారు. గతంలో ఉన్న పట్టభద్రుల ఓట్ల జాబితా రద్దు చేసిన కారణంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు నూతనంగా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఓటు నమోదు చేసేందుకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ ఓటు నమోదు చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడేళ్ల అరాచక పాలన ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటి వరకు 20000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. యువతకు ఎన్నో ఆశలు చూపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేసిందన్నారు. పట్టబద్రులకి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుందని సరైన ఆలోచన చేసి తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగి ఉండి వారి సమస్యలను పరిష్కరించగలిగే సమర్ధమైన నాయకుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని అప్పుడే పట్టభద్రుల ఆశలు నెరవేరుతాయని ఆకాంక్షించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నందున పట్టభద్రులు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్రా పరమేష్, యరకల సూర్యానారయణ గౌడ్, సూరం లక్ష్మికాంత్ రెడ్డి,యూత్ నాయకులు సాంబార్ చంద్రశేఖర్, పోలెపాక శ్యాంసుందర్,ఈదుల సైదులు, పల్స క్రిష్ణయ్య, గోట్టిపర్తి జానయ్య, షేక్ అబ్దుల్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.