Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారుల పతకాల పంట

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:45 PM | తాజా వార్తలు
తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారుల పతకాల పంట

జాతీయ స్థాయిలో సత్తా చాటిన జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు

జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల్.జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పలు పతకాలను సాధించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన గద్వాల ప్రాంతానికి చెందిన క్రీడాకారులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన సబ్-జూనియర్, జూనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్నారు.

పూమ్సే, క్యోరగి విభాగాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పూమ్సే వ్యక్తిగత విభాగంలో సహస్ర వెండి పతకం సాధించింది. జంట విభాగంలో బన్వేష్, వేదాంశి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్ విభాగంలో అక్షయ, రిషిక, తన్వి, సుప్రీతి, అబ్దుల్ రజాక్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాలు సాధించారు.

క్యోరగి విభాగంలో భార్గవ్ కాంస్య పతకం, ఎన్. వాగ్దేవ్ రెడ్డి, టి. సమర్థ వాశిష్ట రెడ్డి కాంస్య పతకాలు సాధించారు.

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాస్టర్ కే.శ్రీహరి, జాతీయ రిఫ్రీ యల్, మల్లికార్జున్ గౌడ్, టీ, యమ్, మౌనిక. కోచ్‌లు హరి క్రిష్ణ, శివ క్రిష్ణ,తరుణ కూమార్ లు,తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందించారు. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదలతో క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో పాల్గొని జిల్లా పేరును జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.