తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారుల పతకాల పంట
జాతీయ స్థాయిలో సత్తా చాటిన జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల్.జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పలు పతకాలను సాధించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన గద్వాల ప్రాంతానికి చెందిన క్రీడాకారులు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన సబ్-జూనియర్, జూనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్నారు. పూమ్సే, క్యోరగి విభాగాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పూమ్సే వ్యక్తిగత విభాగంలో సహస్ర వెండి పతకం సాధించింది. జంట విభాగంలో బన్వేష్, వేదాంశి బంగారు...