Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:35 PM | జోగులాంబ- గద్వాల్
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎక్కువ పరిహారం ఇప్పిస్తాం అంటూ రైతుల వద్ద డబ్బులు వసూలు చేసే దళారులు మధ్యవర్తులను నమ్మవద్దు. వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని అన్నారు. ఎవరైనా పరిహారం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన వసూలు చేయడానికి ప్రయత్నించినా వారి పేర్లతో సహా ఆధారాలను పోలీసులకు అందించి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీ విజయుడు గారు హెచ్చరించారు. రైతుల నష్టపరిహారం రైతుల హక్కు దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.