దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎక్కువ పరిహారం ఇప్పిస్తాం అంటూ రైతుల వద్ద డబ్బులు వసూలు చేసే దళారులు మధ్యవర్తులను నమ్మవద్దు. వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని అన్నారు. ఎవరైనా పరిహారం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన వసూలు చేయడానికి ప్రయత్నించినా వారి పేర్లతో సహా ఆధారాలను...