Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయ స్థాయిలో పేట పెసర్లకు రికార్డు ధర

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:31 PM | తాజా వార్తలు
జాతీయ స్థాయిలో పేట పెసర్లకు రికార్డు ధర

- ఇతర రాష్ట్రాల ఎగుమతితో పెరుగుతున్న ధర
జాతీయ స్థాయి మార్కెట్లను తలదన్నెల క్వింటా రూ 9200 పలికిన పేట పెసర్లు
సూర్యాపేట, అక్టోబర్ 6 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ప్రస్తుత సీజన్లో రైతులు తీసుకొస్తున్న పెసర్లకు జాతీయ స్థాయిలో రికార్డు ధర పడినట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మార్కెట్ సెక్రటరీ ఎం.డి. ఫసీయోద్దీన్ లు తెలిపారు. ప్రభుత్వం పెసర్లకు మద్దతు ధర క్వింటా రూ 8780 ప్రకటించగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు రైతులు తెచ్చిన పెసర్లకు అంతకు మించి క్వింటా రూ 9,200ల ధర పడిందని ఈ ధర దేశంలోని పెసర మార్కెట్లలో పడే ధర కంటే అధికమన్నారు. దేశంలోనే అతి పెద్ద పెసర మార్కెట్ గా ఉన్న మహారాష్ట్రలోని అకోలా మార్కెట్లో క్వింటా రూ 8,851 ధర పడగా తమిళనాడులోని సేలం మార్కెట్లో క్వింటా రూ 6వేలు పడిందన్నారు. మన ప్రాంతంలోని రైతులు చెత్త చెదారం లేకుండా పరిశుబ్రమైన పెసర్లను మార్కెట్ కి తీసుకొస్తుండడంతో ఈనామ్ లో పోటీతత్వంతో ధర పెరుగుతుందన్నారు. అంతే కాకుండా మన రైతులు పండించిన పెసర్లు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని ఇది సూర్యాపేటకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కి వచ్చిన రైతు కళ్ళల్లో ఆనందం నింపేలా పాలకవర్గం, అదికారులు ఎప్పటికప్పుడు ధరలను పర్యవేక్షిస్తూ రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు పడేలా కృషి చేస్తున్నామన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.