Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పేరబోయిన గూడెం పై ప్రేమ ఎందుకు... తుంగగూడెం పై వివక్ష ఎందుకు

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:24 PM | తాజా వార్తలు
పేరబోయిన గూడెం పై ప్రేమ ఎందుకు... తుంగగూడెం పై వివక్ష ఎందుకు

ఇసుకరీచ్ లపై వివక్ష చూపిస్తున్న మైనింగ్ అధికారులు...!
సొంత ట్రాక్టర్లతో ఇసుక దందా చేస్తున్న మైనింగ్ ఉద్యోగులు
సూర్యాపేట బ్యూరో: మైనింగ్ శాఖ లీలలు ఎన్నని చెప్పాలి... ఏమని రాయాలి...!

సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ శాఖ అధికారుల, ఉద్యోగుల స్వార్థం, వివక్షతల కారణంగా ఇసుక రవాణా చేసే వారు ఆదాయం కోల్పోతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకునే ట్రాక్టర్ల వారికి ఎక్కువ దూరంలో ఇసుక కేటాయింపులు జరుగుతూ 5000 రూపాయల పైగా ఆదాయం వచ్చేలా, తమకు ముడుపులు అందే వారికి సాయం చేస్తూ ట్రాక్టర్ల ఇసుక రవాణాలో వ్యత్యాసాలు చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమ మాట వినకుండా నిక్కచ్చిగా మాట్లాడుతూ ముడుపులు ఇవ్వడానికి ఇష్టపడని వారిని గుర్తించి వారికి ఇసుక కేటాయింపులు దగ్గర ప్రాంతాల్లో జరిపి ఒక ట్రిప్పుకు కేవలం 800, 1000 రూపాయలు మాత్రమే వచ్చేలాగా మైనింగ్ అధికారులు కుట్రలకు తెరలేపుతున్నారని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరబోయిన గూడెం పై ప్రేమ... తుంగగూడెం పై వివక్ష ఎందుకు? వాస్తవానికి జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల్లో గల పేరబోయిన గూడెం రీచ్ కు పక్కనే తుంగగూడెం రీచ్ కూడా ఉంటుంది. ఈ రెండు రీచ్ ల విషయంలో గతంలో బాట పంచాయతీ కూడా జరిగింది. తుంగగూడెం ఇసుక రీచ్ కు బుక్ చేసుకోవాలంటే మోతే, నూతనకల్, చివ్వెంల, మద్దిరాల మండలాలలోని చాలావరకు గ్రామాలకు అవకాశం లేదు. చివ్వెంల మండలం వెంకట్ తండా, టీకం తండా, వాల్య తండా, నూతనకల్ మండలం బిక్కుమల్ల, అలుగునూరు, మోతే, మద్దిరాల మండలాల్లోని మరికొన్ని గ్రామాలకు తుంగగూడెం నుంచి బుక్ చేసుకునే అవకాశం లేక వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకే ప్రాంతం అయినా పేరబోయిన గూడెం నుంచి ఒక ఊరికి రూ.5449 బిల్లు రాగా, అదే ఊరికి తుంగగూడెం నుండి రూ.5069 బిల్లు రావడం బిల్లులలో తేడాలకు ఉదాహరణ. మైనింగ్ కార్యాలయం కంప్యూటర్, కలెక్టరేట్ లోని కంప్యూటర్ల ద్వారా తమకు అనుకూలంగా కంప్యూటర్ ఆపరేటర్లను ఉంచుకొని తాము చెప్పిన వాహనాలకు చెప్పిన చోటు నుంచి ఇసుక బుక్ అయ్యేలా మాయాజాలం జరుగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర మండలాల వారికి ఎందుకు?

ప్రకృతి ఇచ్చిన సంపద ఎక్కువగా స్థానికులకే ఉపయోగపడేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. కానీ ఇసుక రీచ్ లు ఉన్న మండలాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా సొంత మండలాల ట్రాక్టర్లను కాదని సూర్యాపేట రూరల్, చివ్వెంల మండలాల ట్రాక్టర్ల వారికి అవకాశాలు ఎలా లభించాయన్నది సమాధానం దొరకని ప్రశ్న. స్థానిక మండలాల వారు ఇసుక రవాణాకు తమ ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలంటూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అవి బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు తగు విధంగా విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
✍️ డాక్టర్ కృష్ణ బంటు, గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.