పేరబోయిన గూడెం పై ప్రేమ ఎందుకు... తుంగగూడెం పై వివక్ష ఎందుకు

ఇసుకరీచ్ లపై వివక్ష చూపిస్తున్న మైనింగ్ అధికారులు...! సొంత ట్రాక్టర్లతో ఇసుక దందా చేస్తున్న మైనింగ్ ఉద్యోగులు సూర్యాపేట బ్యూరో: మైనింగ్ శాఖ లీలలు ఎన్నని చెప్పాలి... ఏమని రాయాలి...! సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ శాఖ అధికారుల, ఉద్యోగుల స్వార్థం, వివక్షతల కారణంగా ఇసుక రవాణా చేసే వారు ఆదాయం కోల్పోతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకునే ట్రాక్టర్ల వారికి ఎక్కువ దూరంలో ఇసుక కేటాయింపులు జరుగుతూ 5000 రూపాయల పైగా ఆదాయం వచ్చేలా, తమకు ముడుపులు అందే వారికి సాయం చేస్తూ ట్రాక్టర్ల ఇసుక రవాణాలో వ్యత్యాసాలు చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమ మాట వినకుండా నిక్కచ్చిగా మాట్లాడుతూ ముడుపులు ఇవ్వడానికి ఇష్టపడని వారిని గుర్తించి...