Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దివ్యాంగుల పింఛన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 06:41 PM | తాజా వార్తలు
దివ్యాంగుల పింఛన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. దివాంగుల పింఛన్ల పక్రియ సక్రమంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం. గద్వాల మండలంలోని సంగాల, జిల్లేడు బండ,గోన్ పాడు, శెట్టి ఆత్మకూరు,మదనపల్లి, గుంటిపల్లి, ముల్కలపల్లి,లత్తిపూర్ గ్రామాల్లో దివ్యాంగుల పింఛన్ల జిల్లా స్థాయి ధ్రువీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్పాల్గొని,దివ్యాంగుల పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ పింఛన్లు అందేలా ధ్రువీకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా,పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పింఛన్ల కోసం సమర్పించిన దరఖాస్తులు,లబ్ధిదారుల వివరాలు,అర్హతలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడూ ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలకు దూరం కాకుండా చూడాలని,అదే సమయంలో అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.అవసరమైన వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.