Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

8 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 11:19 PM | క్రైమ్ Crime
8 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్

- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్.
- రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం.
- 08 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు, నిందితుల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం వివరాలను వెల్లడించారు.
సూర్యాపేట:సూర్యాపేట జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, వైన్స్ షాపుల్లో మద్యం చోరీలు, వ్యవసాయ బావుల వద్ద సబ్‌మర్సిబుల్ మోటార్లు, కరెంట్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.20లక్షల విలువైన నగదు, బంగారు–వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు, మద్యం సీసాలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
గత ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన బొక్క వెంకట్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో వ్యవసాయ మోటార్, కేబుల్ వైర్, సీసీ కెమెరా హార్డ్ డిస్క్, ఇన్వర్టర్, బ్యాటరీ, బంగారు ఆభరణాలు, నగదు తదితర వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున పాత సూర్యాపేట X రోడ్డు వద్ద, సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆత్మకూర్ (ఎస్) ఎస్సై ఎం. ఐలయ్య తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. మూడు మోటార్ సైకిళ్లపై ఐదుగురు వ్యక్తులు ఒక వ్యవసాయ మోటార్‌ను తీసుకుని అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాత సూర్యాపేటకు చెందిన సురికంటి నరేష్ @ నరేష్ రెడ్డి, మేరెడ్డి మహిపాల్ రెడ్డి @ ప్రీతం రెడ్డి, పన్నాల గిరిధర్ రెడ్డి, శివరాత్రి అరవింద్ @ అరుణ్, కాసాల ఉదయ్ కిరణ్ రెడ్డి @ కిరణ్ రెడ్డిగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితులు గత సంవత్సరం కాలంగా గ్రూపుగా ఏర్పడి సూర్యాపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో, అలాగే నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మొత్తం 08 చోరీ కేసులు ఛేదింపు..
నిందితుల విచారణలో ఇప్పటివరకు కింది ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు, ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో – 02 కేసులు, చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో – 02 కేసులు, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో – 03 కేసులు, నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో – 01 కేసు మొత్తం 08 చోరీ కేసులను ఈ ముఠా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల వివరాలు
A-1. సురికంటి నరేష్ @ నరేష్ రెడ్డి R/o పాత సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలం.
A-2. మేరెడ్డి మహిపాల్ రెడ్డి @ ప్రీతం రెడ్డి నరేష్ రెడ్డి మేనల్లుడు.
R/o వల్లాల, శాలిగౌరారం మండలం, ప్రస్తుతం పాత సూర్యాపేట.
A-3. పన్నాల గిరిధర్ రెడ్డి R/o పాత సూర్యాపేట.
A-4. శివరాత్రి అరవింద్ @ అరుణ్ R/o పాత సూర్యాపేట.
A-5. కాసాల ఉదయ్ కిరణ్ రెడ్డి @ కిరణ్ రెడ్డి R/o పులగంవారిగూడెం, సూర్యాపేట మండలం.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు..
08 కేసులకు సంబంధించి సుమారు రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
నగదు, బంగారం, వెండి:
- ₹1,20,000 నగదు
- సుమారు 7.5 తులాల బంగారు ఆభరణాలు
- సుమారు 20.5 తులాల వెండి వస్తువులు
ఎలక్ట్రానిక్ వస్తువులు:
- OnePlus 55" Smart TV – 01
- Samsung 43" Smart TV – 01
- TPL 43" Smart TV – 01
- Boat Sound Bar – 01
- LG Microwave Oven – 01
- ఇన్వర్టర్ – 01
- బ్యాటరీ – 01
వ్యవసాయ పరికరాలు:
- 5 HP సబ్‌మర్సిబుల్ మోటార్లు – 02
- కరెంట్ వైరు – సుమారు 30 మీటర్లు
మద్యం:
- వివిధ బ్రాండ్లకు చెందిన 740కి పైగా మద్యం సీసాలు/క్వార్టర్లు
వాహనాలు, ఇతర వస్తువులు:
- మోటార్ సైకిళ్లు – 03
సెల్‌ఫోన్లు – 05
జల్సాల కోసం చోరీలకు పాల్పడిన ముఠా..
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు సురికంటి నరేష్ @ నరేష్ రెడ్డి తన స్నేహితులు, బంధువులతో కలిసి ముఠాగా ఏర్పడినట్లు వెల్లడైంది. మద్యం సేవించడం, జల్సాలకు అలవాటుపడటం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కాలంగా వివిధ ప్రాంతాల్లో ఇళ్లను, వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్లను, వైన్స్ షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ఎస్పి తెలిపారు. చోరీ చేసిన నగదు, వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును జల్సాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు..
ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకోవడంలో డీఎస్పీ వి. ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, సూర్యాపేట రూరల్ సీఐ పర్యవేక్షణలో ఆత్మకూర్ (ఎస్) సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. ఐలయ్య మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో చురుకుగా వ్యవహరించారు. నమ్మదగిన సమాచారం సేకరించి, సమయస్ఫూర్తితో వాహన తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కె. నరసింహ అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులు, నగదు భద్రపరచుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

8 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.