8 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. - రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. - 08 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్ సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు, నిందితుల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం వివరాలను వెల్లడించారు. సూర్యాపేట:సూర్యాపేట జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, వైన్స్ షాపుల్లో మద్యం చోరీలు, వ్యవసాయ బావుల వద్ద సబ్మర్సిబుల్ మోటార్లు, కరెంట్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు....