Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 05 Oct 2026, 10:13 PM | తెలంగాణ Telangana
తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు అమలు చేసి, కేసులతో సంబంధం లేకుండా ఉద్యమకారులను గుర్తించాలనీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుమలగిరి మండల ప్రజావాణిలో ఎంపీడీవో లాజరుకు వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సంఘాలకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 25 వేలు పెన్షన్ ,250 గజాల ఇంటి జాగా, గుర్తింపు కార్డులు ఇవ్వాలి . కేసులతో సంబంధం లేకుండా ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల నిధులను విడుదల చేయాలి, హెల్త్ కార్డు లను మంజూరు చేయాలి, అన్ని ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలి, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి,ఆరు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న మలి దశ ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించకపోవడం అన్యాయం అన్నారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేకమంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు, ఆ త్యాగాలు చేసిన కుటుంబాలను, కనీసం గత ప్రభుత్వం గానీ ఇప్పుడున్న ప్రభుత్వంగానీ ఇంతవరకు గుర్తించకపోవడం చారిత్రక తప్పిదం ఇప్పటికైనా, ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి రహమనాలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి ఎస్ కే చాంద్ పాషా తిరుమలగిరి పట్టణ శాఖ అధ్యక్షులు కొండ సోమయ్య గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య శేఖర్, మండల ఉపాధ్యక్షులు నిర్మల బాలకృష్ణ సహాయ కార్యదర్శి ఎర్రబెల్లి వెంకన్న, ఎండి సాదిక్ అలీ, గిలకత్తులో హనుమాన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.