తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి
తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు అమలు చేసి, కేసులతో సంబంధం లేకుండా ఉద్యమకారులను గుర్తించాలనీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుమలగిరి మండల ప్రజావాణిలో ఎంపీడీవో లాజరుకు వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సంఘాలకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 25 వేలు పెన్షన్ ,250 గజాల ఇంటి జాగా, గుర్తింపు కార్డులు ఇవ్వాలి . కేసులతో సంబంధం లేకుండా ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి...