Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తిరుమలగిరిలో అదనపు కోర్టునూ నిర్మించాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 05 Oct 2026, 10:09 PM | తెలంగాణ Telangana
తిరుమలగిరిలో అదనపు కోర్టునూ నిర్మించాలి

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అదనపు కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం నాడు తిరుమలగిరి మండల ప్రజావాణిలో ఎంపీడీవోకు తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా అదనపు కోర్టు లను మంజూరు చేసింది అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న కోర్టుతోపాటు మరొకటి అదనంగా మంజూరు చేశారు అట్టి కోర్టును తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుండి వచ్చే కక్షిదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది, తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ జిల్లాలకు కూడలిగా ఉండి హైదరాబాద్ వరంగల్ సూర్యాపేట ఖమ్మం భద్రాచలం విజయవాడ పట్టణాలకు ఎంతో అనువుగా ఉంటుంది
దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా తుంగతుర్తికి వివిధ కేసులు నిమిత్తం వెళ్లాలంటే సరియైన రవాణా సౌకర్యం లేకపోవడం వలన దూర ప్రాంతాల నుండి వచ్చే అధికారులతో పాటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్ సౌకర్యం లేకపోవడం మూలంగా తుంగతుర్తి కి పోవడం కోసం గంటల తరబడి వేచి చూసి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సివస్తుంది. ఇదే అదునుగా భావించిన వారు ఒక్కో వ్యక్తికి 500 నుండి 1000 రూపాయలు తుంగతుర్తికి వెళ్లాలంటే వారికి ఇవ్వాల్సిందే, ఇదే సమయంలో కోర్టు వాయిదాకు సక్రమంగా హాజరు కాకపోతే కేసులు పెండింగ్లో ఉండి శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అదనపు కోర్టును ఏర్పాటు చేస్తే అధికారులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చే కక్షిదారులకు అలాగే లాయర్లకు ఎంతో సౌకర్యంగా ఉండి సరైన సమయానికి కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నది కాబట్టి పై విషయాలన్నీ పరిశీలించి తిరుమలగిరి కి అదనపు కోర్టును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి రహమనాలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి ఎస్కె చాంద్బాషా, తిరుమలగిరి పట్టణ శాఖ అధ్యక్షులు కొండ సోమయ్య గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య శేఖర్, మండల ఉపాధ్యక్షులు నిర్మల బాలకృష్ణ సహాయ కార్యదర్శి ఎర్రబెల్లి వెంకన్న, ఎండి సాదిక్ అలీ, గిలకత్తులో హనుమాన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.