తిరుమలగిరిలో అదనపు కోర్టునూ నిర్మించాలి

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అదనపు కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం నాడు తిరుమలగిరి మండల ప్రజావాణిలో ఎంపీడీవోకు తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా అదనపు కోర్టు లను మంజూరు చేసింది అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న కోర్టుతోపాటు మరొకటి అదనంగా మంజూరు చేశారు అట్టి కోర్టును తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుండి వచ్చే కక్షిదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది, తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం సూర్యాపేట,...