Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 05 Oct 2026, 09:59 PM | తెలంగాణ Telangana
చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలంలోని మాలిపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐదవ వార్డు ఆరో వార్డు ఏడో వార్డుకు సంబంధించిన గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన్న కార్యక్రమం చేశారు పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వయస్సుకు తగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తిరుమణి యాదగిరి , కేసిడి కవిత, బత్తుల శ్రీనివాస్, ఏఎన్ఎం మాధవి అంగన్వాడీ టీచర్స్ చంద్రకళ పద్మ పర్వీన్ ప్రధానోపాధ్యాయులు చక్రు ఆశ వర్కర్స్ స్వరూప చైతన్య మరియు గర్భిణీలు బాలింతలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.