చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి
తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలంలోని మాలిపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐదవ వార్డు ఆరో వార్డు ఏడో వార్డుకు సంబంధించిన గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన్న కార్యక్రమం చేశారు పిల్లల...