Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజావాణి.. బాధితులకు భరోసా

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 07:49 PM | జోగులాంబ గద్వాల్
ప్రజావాణి.. బాధితులకు భరోసా

⟹ 18 మంది ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.
⟹ ఫిర్యాదులపై తక్షణ చర్యలు.. నిష్పక్షపాత విచారణతో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు నమ్మకమైన వేదికగా మారుతోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ , సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నమ్మకమే పోలీస్ శాఖకు బలమని పేర్కొంటూ, సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ సోమవారం ప్రజావాణిలో భూ వివాదాలు – 05, వ్యక్తిగత గొడవలు – 02, భర్త వేధింపులు – 02, కుటుంబ తగాదాలు – 03, చీటింగ్ – 03, ఇతర సమస్యలు – 03 ఫిర్యాదులు వచ్చాయి.

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పురోగతిని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.