Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 07:48 PM | జోగులాంబ గద్వాల్
దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

మనోపాడులో సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల.

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. మనోపాడు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను గ్రామ సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. సంగారెడ్డిలో జరగనున్న ఈ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల ఫోరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ రాష్ట్ర మహాసభలను దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ మహాసభలు ఒక వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్, సీనియర్ జర్నలిస్ట్ కురుమన్న, మల్లేష్ మాదిగ, శ్రీను, బాషా తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.