దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
మనోపాడులో సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల. జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. మనోపాడు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను గ్రామ సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. సంగారెడ్డిలో జరగనున్న ఈ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల ఫోరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ రాష్ట్ర మహాసభలను దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ మహాసభలు ఒక...