Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 04 Oct 2026, 09:49 PM | తెలంగాణ Telangana
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

తిరుమలగిరి 05 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులoదరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పట్టభద్రులు తమ పూర్తి వివరాలతో కూడిన ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది. విద్యావంతులైన పట్టాభద్రులు చైతన్యవంతంగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు కొత్తగా మళ్లీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.