పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
తిరుమలగిరి 05 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులoదరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పట్టభద్రులు తమ పూర్తి వివరాలతో కూడిన ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది. విద్యావంతులైన పట్టాభద్రులు చైతన్యవంతంగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు కొత్తగా మళ్లీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్...