Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు

Author
Posted By Telangana Vaartha
| 03 Oct 2026, 11:50 PM |
కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రజలకు నాణ్యమైన వైద్యమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

కోదాడ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన, మెరుగైన ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా ఎస్పీ నరసింహలతో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.
రూ. 26 కోట్లతో 100 పడకల స్థాయికి పెంపు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 30 పడకలుగా ఉన్న కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశామని వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం రూ. 26 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆసుపత్రి పునరుద్ధరణ పనులతో పాటు నూతనంగా నిర్మించిన ఎగ్జిస్టింగ్ బ్లాక్, ఇన్‌పేషెంట్ విభాగాలు పూర్తికావడంతో వెంటనే ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
అన్ని రకాల సేవలు పునఃప్రారంభం
శనివారం నుంచే ఆసుపత్రిలో అన్ని రకాల ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినందున కోదాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, రోగులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సహాయం అందించి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని వైద్యాధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, లక్ష్మారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పెండెం వెంకటరమణ, డీసీహెచ్‌‌ఎస్ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, డాక్టర్ సుబ్బారావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర వైద్యులు, ప్రజా ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.