Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 03 Oct 2026, 09:21 PM | తెలంగాణ Telangana
ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

తిరుమలగిరి 04 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ,ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ బిల్లును నియోజకవర్గానికి మొదటి విడుదల 3500 ఇళ్లను మంజూరు చేసింది స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా గ్రామా ,మండల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేశారు మొదట విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులు తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలలో ఇండ్లను పునాది వరకు నిర్మించినా నేటి వరకు బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ,దేవుడు వరమిచ్చిన పూజారి అందనివ్వడు అనే చందంగా ఈ వ్యవస్థ తయారైందని పలువు లబ్ధిదారులు ఆరోపించారు తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినా ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఇండ్ల నిర్మాణం లో భాగంగా పునాది వరకు అప్పుచేసి నిర్మించిన రావలసిన మొదటి విడత బిల్లు రాకపోవడంతో అప్పుల ఊబిలో కోల్కపోతున్నామని పలువూరు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బిసి ఇతరులకు 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇట్టి ఉత్తరాలు ప్రకారం ఇల్లు మంజూరైన వారు నిర్మించుకుంటున్నప్పటికీ అధికారులు వచ్చి జిపిఎస్ సిస్టం ద్వారా ఫోటోగ్రఫీ తీసుకొని ఏస్ట్ మెంట్ వేసినా ఇప్పటివరకు బిల్లు రాలేదని పలువురు లబ్ధిదారు తెలిపారు, తాము బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నేటి వరకు లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందచేయలేదని పలు ఆరోపణలు ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరగాయని పలువూరు తెలిపారు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి మున్సిపాలిటీని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా అత్యధిక కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ గెలవడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది అలాగే మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కొంతమంది దళారులు లబ్ధిదారుల నుండి ఎంతోకొంత మామూళ్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటి బిల్లులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు కాగా మండలంలో కొన్ని గ్రామాల్లో ఇల్లు పూర్తయి ప్రారంభోత్సవాలు జరిగిన కొన్ని గ్రామాల్లో నేటి వరకు పునాది వరకే మిగిలిపోయాయని తెలిపారు సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.