Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

Author
Posted By Telangana Vaartha
| 03 Oct 2026, 07:16 PM | జోగులాంబ గద్వాల్
మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

జోగులాంబ గద్వాల 3 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.
⟹ ఎవరి పాత్రలో వారు న్యాయం చేస్తేనే పోలీస్ వ్యవస్థ పటిష్టం
⟹ కొత్త సిబ్బందికి క్రమశిక్షణ.. సీనియర్లకు మార్గనిర్దేశం మరింత కీలకం
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు రావాలని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు నూతన విషయాలను నేర్చుకుంటూ అప్‌డేట్‌ కావాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పాత్రలో పూర్తి న్యాయం చేస్తూ, బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు. మెన్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఫాదర్‌ రోల్‌లో ఉంటే, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు మదర్‌ రోల్‌లో ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు. స్టేషన్‌ పనితీరు, సిబ్బంది క్రమశిక్షణను పటిష్టం చేయడంలో సీనియర్‌ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లోకి వచ్చిన సిబ్బందికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఇటీవల సర్వీసులోకి వచ్చిన కొత్త బ్యాచ్‌ సిబ్బంది పోలీస్‌ శాఖ క్రమశిక్షణ, నియమ నిబంధనలు, విధి విధానాలను తప్పనిసరిగా పాటించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. “మీ సర్వీస్‌ను మీరు గౌరవంగా నిర్వహించండి” అని సూచించిన ఎస్పీ.. ప్రతిరోజూ చేసే విధుల్లో చిన్నచిన్న మెరుగుదలలు తీసుకురావడం ద్వారా పోలీసింగ్‌లో క్వాలిటీ ఆఫ్ ఫంక్షన్‌ పెంచాలని అన్నారు. చట్ట ప్రకారమే విధులు నిర్వహిస్తూ, తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున విధులు నిర్వహిస్తున్న మనం అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయంతో, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో ఓపికగా, గౌరవంగా మాట్లాడి, వారి సమస్యలను చట్టపరమైన పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నా.. సేవలో చివరి రోజు వరకు అదే బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.