మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్
జోగులాంబ గద్వాల 3 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ⟹ ఎవరి పాత్రలో వారు న్యాయం చేస్తేనే పోలీస్ వ్యవస్థ పటిష్టం ⟹ కొత్త సిబ్బందికి క్రమశిక్షణ.. సీనియర్లకు మార్గనిర్దేశం మరింత కీలకం మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు రావాలని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు నూతన విషయాలను నేర్చుకుంటూ అప్‌డేట్ కావాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పాత్రలో పూర్తి న్యాయం చేస్తూ, బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని...