Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

100% సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ.

Author
Posted By A.Timma Gurudu
| 03 Oct 2026, 01:30 PM | Array
100% సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ.

ముఖ్యమైన పాయింట్స్:

  • ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.

జోగులాంబ గద్వాల3 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆలంపూర్ నియోజకవర్గం, ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం–వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీ 2026–27 సీజన్‌కు 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ విజయుడు మాట్లాడుతూ రైతుల పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

100% సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.