Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అధికారులేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్

Author
Posted By Telangana Vaartha
| 02 Oct 2026, 05:34 PM | Array
అధికారులేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్

ఆదాయం ఉన్న అధికారులు లేక ఇబ్బందులు.
ప్రభుత్వం. అధికారుల నియామకం చేపట్టాలని డిమాండ్.
జోగులాంబ గద్వాల2 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:-
గద్వాల పట్టణాన్ని కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డు లో అధికారులు అవసరం ఉన్నంత అధికారులు లేకపోవడం వలన మార్కెట్ యార్డుకు రావాల్సిన ఆదాయం నీ సమకూర్చడంలో అధికారులకు తాళకు మించిన భారంగా మారింది. నిత్యము కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ కొనసాగుతున్నడంతో అధికారులు పర్యవేక్షణ లేక ఆదాయమంతా పక్కదారి వెళుతుందని నిమర్శలు ఉన్నాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో 26 మంది అధికారులు ఉండాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వము. ఉన్నతాధికారులు మార్కెట్ యార్డులో అధికారులను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వానికి గద్వాల జిల్లాలో నీ అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు గద్వాల వ్యవసాయ జాతీయ మార్కెట్ యార్డ్ నుంచి 2025 సంవత్సరంలో 11 కోట్లు సెస్సు రూపాన వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వానికి మార్కెట్ యార్డ్ నుంచి కోట్ల రూపాయలు సమకూరుస్తున్న అధికారులు పూర్తిస్థాయిలో నియామకాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేచ్చేందుకు అవకాశం మెండుగా ఉంది. గద్వాల వ్యవసాయ జాతీయ మార్కెట్ యార్డ్ లో సుమారు 200 ట్రేడర్స్. కమిషన్ ఏజెంట్లు సుమారు 100. జన్నింగు మిల్లులు. రైస్ మిల్లులు ఇలా ఆదాయం ఉన్న వనర్లు ఉన్న సిబ్బంది లేకపోవడం వలన. ఉన్న ఐదుగురు సిబ్బందికి బరువు బాధ్యతలతో పనిచేస్తున్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గద్వాలలో మార్కెట్ కార్యదర్శి ఇంచార్జి కొనసాగడం వలన పూర్తి స్థాయిలో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సూపర్వైజర్లు పర్యవేక్షణ అనుకున్నంతమంది లేకపోవడం వలన ఉన్న సూపర్వైజర్లకు తీవ్ర సమస్యగా ఏర్పడింది. సెక్యూరిటీ గార్డ్లు పర్యవేక్షణ. ఔట్సోర్సింగ్ నిమకాలు వంటివి చేపట్టి పూర్తిస్థాయిలో మార్కెట్ యార్డ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే వ్యవసాయ మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.
ఇన్చార్జిల అధికారుల వలన నా ఇబ్బందులు.
జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గద్వాల యందు పనిచేసే ఇన్చార్జిల అధికారులు ఉండడం వలన మార్కెట్ కు వచ్చే. ఆదాయము ప్రభుత్వము అధికారులు కోల్పోతున్నారు. రెగ్యులర్గా మార్కెట్ కార్యదర్శి. అసిస్టెంట్ మార్కెటింగ్ డివిజనల్ అధికారిని రెగ్యులర్గా నియమించి. మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న వ్యాపారాలని రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా అధికారులు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇన్చార్జిల అధికారుల వలన వాళ్ళు ఎప్పుడూ వచ్చేది తెలియదు. ఎప్పుడు వెళ్ళేది తెలియని పరిస్థితి కనబడుతుంది. సీజను ప్రారంభం కానున్నందున. నిత్యము రెగ్యులర్ గా మార్కెట్ యార్డ్ కు వచ్చే సెనగలు. మొక్కజొన్నలు. తదితర వంటి పంటలు మార్కెట్ యార్డ్ కు రైతులు తీసుకొని వచ్చి అమ్ముకొని వెళ్లే పరిస్థితులు ఏర్పడక ముందే అధికారులు పూర్తిస్థాయిలో నియమించి. మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ వేగవంతంగా జరిగేందుకు ఉన్నతాధికారులు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అధికారులు లేక ప్రభుత్వ ఆదాయానికి గండి. </b>
గద్వాల జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు. అధికారులు లేకపోవడం వలన ప్రభుత్వ వానికి వచ్చే ఆదాయము కోల్పోతుంది. మధ్యవర్తులు కమిషన్ ఏజెంట్లు బ్రోకర్లు రైతుల ద్వారా దోపిడి చేస్తూ మార్కెట్ యార్డ్ కు రావాల్సిన ఆదాయము రాకుండా పోతుంది. ఇక్కడ రోజు రైతులు వివిధ రకాల పంటల పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్ వస్తే అధికారులు లేకపోవడం వలన రైతుల గోడు ఎవరు చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు కమిషన్ ఏజెంట్ ద్వారా వచ్చిన కాడికి వచ్చి జేబులేసుకుని రైతు పూర్తిస్థాయి నష్టాన్ని భరాంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి అధికారులు పూర్తిస్థాయిలో రెగ్యులర్గా ఏర్పాటు చేసి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరుగా మార్కెట్ యార్డ్ ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది స్థానికులు వా పోతున్నారు.

అధికారులేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.